గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 18, 2020 , 22:58:05

ప్రాణవాయువును పరిరక్షిద్దాం

ప్రాణవాయువును పరిరక్షిద్దాం

సీఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పినట్లు రేపటి రోజు కోట్ల సంపాదన ఒకవైపు, కాలు ష్యకారకమైన పరిసరాలు మరోవైపు ఉంటే, మన వారసులకు మనం ఇవ్వాల్సిందేమిటి. ఆస్తులా, నివాసయోగ్యమైన పరిసరాలా? ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేని ప్రశ్నలివి. అంతేకాదు ఈ ప్రశ్నలకు సమాధానం అందిరికీ తెలుసు, ఈ సమస్యకు పరిష్కారం కూడా అందరివద్దా ఉన్నది. పర్యావరణహితమైన సమాజం నిర్మాణం కోసం మన వంతు మొక్కలు నాటుదాం, వాటి రక్షణ కోసం పాటుపడుదాం.

వేన కళ్లెదుట రెండు సంఘటనలు. ఒకటి అమెజాన్‌ అడవులు తగలపడటం, మరొకటి ఆస్ట్రేలియాలో కార్చిచ్చు. వాస్తవానికి అమెజాన్‌ అడవిని భూమాతకు ఊపిరితిత్తులతో పోల్చుతారు. అంటే ప్రపంచానికి అవసరమైన ఆక్సీజన్‌ సుమారు 20 శాతానికి పైగా ఒక్క అమెజాన్‌ అడవుల నుంచే మనకు అందుతుంది. అయితే గతే డాది ఈ అడవుల్లో మంటల వల్ల ఏకంగా 3,500 చ.కి.మీ.మేర అడవి నాశనమైంది. ఇది ప్రపంచానికి పశ్చిమాన జరిగితే, ఇక తూర్పున ఆస్టేలియాలో బుష్‌ ఫైర్‌ అనే కార్చిచ్చు వ్యాపించింది. ఈ రెండు సంఘటనలు పర్యావరణపరంగా ప్రపంచానికి ముప్పు పొంచి ఉన్నదన్న సత్యాన్ని మనముందుంచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఆస్ట్రేలియాలో వేస వి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలను దాటాయి. అంతేకాదు రానున్న కాలంలో ఈ వేడి 48-49 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాద ఘంటికలను మన దేశం అర్థం చేసుకోవాలి. 


ఇక మన తెలంగాణ విషయానికి వస్తే, అదృష్టవశాత్తూ పర్యావరణ స్పృహ, అడవులపై ప్రేమ ఉన్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆరేండ్ల కిందట సీఎం కాగానే తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో తెలంగాణకు హరితహారం ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాట డం, తెలంగాణను హరితవనంగా చేయటం ఈ కార్యక్రమ లక్ష్యం. అప్పటి చర్చల్లో పాల్గొని, హరితహారం రూపకర్తల్లో ఒకరైన ఓ సీనియర్‌ అధికారి ఇటీవల మాట్లాడుతూ ఓ మాట అన్నారు. అసలు చెట్టు అవసరాన్ని, పర్యావరణ హితాన్ని ఇంతలా కోరుకున్న ప్రభుత్వాన్ని తన సర్వీసులో చూడలేదన్నాడు.  ప్రతీ నిర్ణయం ఓట్ల రాజకీయం, ప్రతీ పాలసీ వ్యక్తిగత ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్న నేటి రాజకీయాలు మనం చూస్తు న్నాం. కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో ఉన్నది. 


మనం బాగుండాలి, మన చుట్టూ వాతావరణం బాగుండాలనే విన్‌-విన్‌ సూత్రం పాలకులు అమలుచేస్తున్నారు. పర్యావరణం, పచ్చని చెట్లు, ఇంటికి ఆరు మొక్కలు, కనిపెంచిన పిల్లలకు ఆస్తుల కంటే, మంచి నివాసయోగ్యమైన ఆవాసాన్ని ఇద్దామంటూ సీఎం కేసీఆర్‌ పదేపదే చెబుతున్నారు. సమ యం, సందర్భం ఏదైనా సరే, పర్యావరణ అవసరాన్ని చెట్లు విరివిగా పెంచాల్సిన అగత్యాన్ని సీఎం పదేపదే వివరిస్తున్నారు. అందరి బుర్రల్లో పచ్చని మొక్కల అవసరాన్ని నాటే ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్న ఫలితాల్లో ఆలస్యం జరుగొచ్చు. కానీ సంకల్పం మంచిదైనప్పుడు, తప్పకుండా పాజిటివ్‌ ఫలితమే వస్తుంది. విశాల ప్రయోజనాల కోసం కాళేశ్వ రం లాంటి జనహిత ప్రాజెక్టులను నిర్మించుకోవటం వల్ల అటవీప్రాంతం కొంతమేర కోల్పోయాం. ప్రత్యామ్నాయ అటవీకరణ ద్వారా ఆ అడవిని మళ్లీ పునరుజ్జీవింపచేసుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. కేవలం ప్రభు త్వ సంకల్పంతో ఫలితాలు రావు, అవసరాన్ని గుర్తించి ప్రతీపౌరుడూ ఓ పర్యావరణహిత కార్యకర్త కావాలి. నాటిన మొక్కలు ఎన్ని, వాటిలో బతికిన శాతం ఎంతో చూడాల్సిన బాధ్య త ఒక్క ప్రభుత్వానిదే కాదు పౌరులందరిది. నాటిన మొక్కలు బతుకాలంటే తన వంతుగా ఏం చేయాలన్న సామాజిక ప్రతీ వ్యక్తిలో, సంస్థలో తక్షణావసరం.


గ్రామాలన్నీ పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలంటూ సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతిని ప్రారంభించారు. త్వరలో పట్టణ ప్రగతీ మొదలౌతుంది. వీటి లక్ష్యం ఒక్కటే పర్యావరణ సంకల్పం ప్రతీ ఒక్కరిలో ఉండాలి. ఇళ్లూ, వాడలు, ఊళ్లతో పాటు రాష్ట్రమంతా చక్కనైన పరిశుభ్రత, చిక్కనైన పచ్చదనం నిండాలి. దేవుడు దయవల్ల ఈ ఏడాది మంచి వానలు పడ్డాయి. కాళేశ్వరం ఇచ్చిన ఫలితాలతో రాష్ట్రమంతటా నీటి భాండాగారమైంది. ఇప్పుడు చేయాల్సిందల్లా మన సొంత పనులతో పాటు, కాస్త సామాజిక బాధ్యత కూడా కలిగిఉండాలి. కంటికి కనిపించే మొక్కలకు కొన్ని నీళ్లు పోయటం, కొంత రక్షణ కల్పించటం. గత ఐదేండ్లుగా ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే చెట్లను కొట్టినంత వేగంగా అవి పెరుగవు. కానీ ఒక్కసారి వేళ్లూనుకుంటే మాత్రం పెరిగి, పెద్దవై మనకు జీవనాధారమైన ఆక్సీజన్‌ ఇవ్వటంతో పాటు, పుట్టిన వ్యక్తి గిట్టేదాకా చెట్టుతో అనుబంధం కొనసాగుతుంది. 


గ్రామీణ ప్రాంతా ల్లో విరివిగా చెట్లు నాటి సామాజిక వనాలను పెంచవచ్చు. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి అనేకపరిమితులు. భూమి కొరతతో పాటు పట్టణ జీవితంలోని వేగం, సామాజిక స్పృహను దాటేస్తుంది. అందుకే ప్రభు త్వం పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అడవులను అభివృద్ధి చేసి పట్ట ణ ప్రాంత అటవీ పార్కులను ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణలో ఒక్కో పట్టణ ప్రాంతానికి సమీపంలో కనీసం ఒక్కటైనా ఇలాంటి పార్కులను ఏర్పాటుచేయాలనేది ప్రభుత్వ ఆశయం. నగర జీవులకు నిత్య జీవితంలో ఉండే ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కల్పించటం, నిత్యం వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌, యోగా లాంటి సౌకర్యాలతో పాటు వారాంతాల్లో కుటుంబాలతో సహా సేదతీరే పిక్నిక్‌ స్పాట్లుగా ఇవి అభివృద్ధి చెందుతున్నాయి. ప్లాస్టిక్హ్రిత ప్రాంతాలుగా, స్వచ్ఛమైన గాలిని అందించే అర్బన్‌ లంగ్‌ స్పేస్‌లుగా ఇవి మనకు అందుబాటులోకి వస్తున్నాయి.


ప్రభుత్వ నినాదమైన ‘జంగల్‌ బచావో-జంగల్‌ బడావో’ స్ఫూర్తిని మనమంతా అందిపుచ్చుకోవాలి. అడవి అవసరాలను భావితరాలకు అర్థమయ్యేలా చెప్పటంతో పాటు, ఉన్న అడవులను రక్షించుకోవటం, కొత్తగా పచ్చదనాన్ని  విస్తరించుకోవటం ఈ నినాదం పరమార్థం. అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఒకటి, ఆ లెక్కన మనకు కూడా పర్యావరణ ప్రమాదం పొంచి ఉన్నట్లే. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారాయి. అగ్రదేశాలు కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే విషయంలో అంతర్జాతీయ వేదికల మీద ఉపన్యాసాలను దంచుతున్నాయే తప్ప, వాస్తవంలో ఆచరణ శూన్యం. అన్ని నీతులు చెప్పే ఆ అగ్రదేశాలే పర్యావరణానికి కలిగిస్తున్న నష్టం ఎక్కువ. అందుకే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. మన చుట్టూ ఆవాసాన్ని, పచ్చదనాన్ని రక్షించుకోవాలి. పెంచుకోవాలి. లేదంటే రానున్నరోజుల్లో ప్రమాదం తప్పదు.


తెలంగాణలో ఉష్ణోగ్రతలు పరిధి దాటుతున్నాయి. కోస్తాకే పరిమితమైన ఉక్కపోత క్రమంగా మన వాతావరణంలోకి చొచ్చుకొస్తున్నది. సమ యం మించిపోలేదు, ఇంతకు మించిన తరుణమూ లేదు. సామాజిక స్పృహ ఉన్న ముఖ్యమంత్రి, సహకరించే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మేర కు పర్యావరణ లబ్ధి పొందకపోతే వ్యక్తులది, సమాజానిదే తప్పు అవుతుం ది. భవిష్యత్‌ తరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకొని, నేటి ఢిల్లీలా స్వచ్ఛ మైన గాలిని పీల్చుకోలేని, శుభ్రమైన నీటిని తాగలేని పరిస్థితి వస్తే అందు కు కారణమైన మనమందరమూ దోషులమవుతాం. అందుకే సీఎం కేసీ ఆర్‌ స్వయంగా చెప్పినట్లు రేపటి రోజు కోట్ల సంపాదన ఒకవైపు, కాలు ష్యకారకమైన పరిసరాలు మరోవైపు ఉంటే, మన వారసులకు మనం ఇవ్వాల్సిందేమిటి. ఆస్తులా, నివాసయోగ్యమైన పరిసరాలా? ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరంలేని ప్రశ్నలివి. అంతేకాదు ఈ ప్రశ్నలకు సమాధానం అందిరికీ తెలుసు, ఈ సమస్యకు పరిష్కారం కూడా అందరివద్దా ఉన్నది. పర్యావరణహితమైన సమాజం నిర్మాణం కోసం మన వంతు మొక్కలు నాటుదాం, వాటి రక్షణ కోసం పాటుపడుదాం.


logo