వనస్థలిపురం : ఆధునిక హంగులతో రూ.1.50కోట్లతో ఉమెన్ థీమ్ పార్కును నిర్మిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎన్జీవోస్ కాలనీలోని నర్సరీ పార్కును ఆయన పరిశీలించారు. పార్కులు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయన్నారు.
నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి పురపాలక మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. మహిళలకోసం ప్రత్యేకంగా పార్కును రూపుదిద్దుతామని తెలిపారు.
విశాలమైన స్థలం బెంచిలు, సమావేశాలు, కిట్టీ పార్టీలు, కౌన్సిలింగ్‌లకు అనువైన నిర్మాణాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, శ్రీనివాస్, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.