
మిడ్జిల్, డిసెంబర్ 10 : అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని వేముల గ్రామంలో వ్యా క్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ టీకాపై అపోహ అవసరంలేదని, అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి టీకా వేయాలని ఎమ్మెల్యే సూచించారు.
కోటమైసమ్మకు పూజలు
మండలంలోని వేములలో శుక్రవారం కోటమైసమ్మ విగ్ర హ ప్రతిష్ఠాపనోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై కోటమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతిఒక్కరూ భక్తిభావం పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, ఎంపీటీసీ యశోద, నాయకులు సుధాబాల్రెడ్డి, బాలు, బాలయ్య, వీరారెడ్డి, దానియేలు, భీంరాజు, ఆంజనేయులు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.