డిచ్పల్లి, డిసెంబర్ 22 : సమాజంలోని అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం మంజూరు చేసిన గిఫ్ట్ ప్యాక్‌లను ఆయన బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం డిచ్పల్లి మండలకేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్లో జరిగింది. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేయడంతోపాటు రూ. 2 లక్షలతో భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు క్రైస్తవుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ క్రైస్తవులకు దుస్తులను అందజేస్తున్నదని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ.. క్రైస్తవుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రవి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల రాములు, డీకొండ హారిక, రమేశ్ నాయక్, బానోత్ అనూష, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ యాదవ్, చిలువేరు గంగదాస్, మొచ్చ శ్రీను, తహసీల్దార్లు వీర్‌సింగ్, రమేశ్, అనిల్‌కుమార్, ప్రశాంత్, జయంత్‌రావు, మల్లేశ్, డిప్యూటీ తహసీల్దార్ అశ్విని, టీఆర్ఎస్ నాయకులు ఒడ్డం నర్సయ్య, హరికిషన్, లక్ష్మీనర్సయ్య, యూసుఫ్, అంబర్‌సింగ్, నీరడి పద్మారావు తదితరులు పాల్గొన్నారు.