షాబాద్, ఫిబ్రవరి 2: ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న జ్వర సర్వే ముమ్మరంగా సాగుతున్నది. బుధవారం నుంచి రెండో విడుత ఫీవర్ సర్వే ప్రారంభించారు. రంగారెడ్డిజిల్లాలో 30,809 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించినట్లు జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇందులో 429మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, హెల్త్కిట్స్ అందజేశారు. రెండో విడుత ఫీవర్ సర్వే వైద్యశాఖ వేగవంతం చేసింది. మొదటి, రెండో విడుతల్లో కలిపి ఇప్పటివరకు జిల్లాలో 6,11,554 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించగా, 14,884 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, హెల్త్కిట్స్ అందించినట్లు పేర్కొన్నారు. కొవిడ్ పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
వికారాబాద్లో 53453 కుటుంబాలు..
పరిగి, ఫిబ్రవరి 2 : వికారాబాద్ జిల్లా పరిధిలో రెండో విడుత ఇంటింటి జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. రెండు రోజుల్లో జిల్లాలోని 53453 కుటుంబాల ఇంటింటి సర్వే పూర్తయింది. జిల్లాలో 220386 కుటుంబాలు ఉండగా 726 ప్రత్యేక బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. బుధవారం జిల్లాలో 29939 కుటుంబాల సర్వే చేపట్టారు.