
మెదక్, జనవరి 9 : రైతుల సంక్షేమానికి ప్ర భుత్వం పెద్దపీట వేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విలేకరుల మాట్లాడారు. రైతుల కండ్లలో సంతోషం చూడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ముఖ్యంగా 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు రూ.5వేల చొప్పు న రెండు పంటలకు రూ.10వేలు నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా రైతుబంధు పథకం ఇవ్వడంలేదని, కేవలం తెలంగాణలోనే సీఎం కేసీఆర్ అమలు చేయడం గొప్ప విషయమన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి రైతుబంధుపై ప్రశంసించారని గుర్తు చేశారు.
రంగవల్లుల్లో రైతుబంధు పథకం..
రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ముగ్గు ల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు రైతుబంధు పథకానికి సంబంధించిన అంశాలను వేశారు. దీంతో వారిని ఎమ్మె ల్యే అభినందించారు. సీఎం కేసీఆర్ బొమ్మలను ముగ్గుల్లో వేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే నగదుతోపాటు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి మాలతి, రెండో బహుమతి సునీత, మూడో బహుమతి శ్రీవల్లికి అందజేశారు. కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, కౌన్సిలర్లు రాగి వనజ, బట్టి లలిత, ఆర్కే శ్రీనివాస్, సుంకయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, కొర్వి రాములు, శ్రీధర్ యాదవ్, దుర్గాప్రసాద్, మాయ మల్లేశం, ఉమర్, నవీన్, మెప్మా పీఆర్పీ సునీత, సీవో దేవపాల, ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు.