
చేగుంట, జనవరి 9 : నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని సంకాపూర్‌లో గిరిజన తండాలో టీఆర్ఎస్ కార్యకర్త రమేశ్ ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ తరఫున మృతుడి భార్య లావణ్యకు రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. సంకాపూర్లోని చింతాల భానుప్రియ,గంగి హరిత,మత్తోల మమత,జనగామ దీపికతో పాటు జెప్తిశివునూర్, శేరిపల్లి గ్రామాల్లో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, రైతులందరికీ రైతు బంధు ఇవ్వడంతో గ్రామాల్లో సంబురాలు చేసుకుంటాన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పట్లోరి రాజు, నార్సింగి ఎంపీపీ చిందం సబిత, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత, మండల రైతు బంధు అధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి,మండలాధ్యక్షుడు మైలరాం బాబు, యూత్ అధ్యక్షుడు సుధీప్గౌడ్, సర్పంచ్‌లు సుజాత, భూలక్ష్మి,షేక్ షరీఫ్, మల్లేశం,ఎంపీటీసీ బండారి సంతోష, ఏఎంసీ డైరెక్టర్ తాళ్ల కృష్ణగౌడ్, రైతు బంధు జిల్లా డైరెక్టర్ జమాల్పూర్ రమేశ్, నాయకులు శివోల్లచంద్రం, యాదగిరి, రాజాసింగ్, పరశురాములు, బాలమల్లయ్య, యాదగిరి, ఆంజనేయులు, రు క్మొద్దీన్, శ్రీనివాస్, అనిల్‌గౌడ్, మహేశ్ గౌడ్, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.