
చిలిపిచెడ్,డిసెంబర్11: ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం చేసుకునే అవకాశాన్ని రైతులకు పోస్టల్ శాఖ అధికారులు కల్పించారు. చిలిపిచెడ్ మండలంలో 19 గ్రామ పంచాయతీలకు మండల కేంద్రంలోని బ్రాంచ్‌లో పోస్టాఫీసు సిబ్బంది రైతులకు ఓటీపీ లింక్ చేయడానికి అందుబాటులో ఉన్నారు. మండలంలోని రైతులు పోస్టల్ సిబ్బంది వద్దకు ఆధార్, మొబైల్ ఫోన్‌తో వస్తే రూ.50 తీసుకొని లింక్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకే కాకుండా అన్నింటికీ ఉపయోగపడనున్నదని సిబ్బంది తెలిపారు
మొబైల్‌కు ఓటీపీ వస్తేనే…
కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లగానే పీపీ సెంటర్ ఇన్చార్జి ట్యాబ్‌లో ఓపీఎంఎస్ యాప్‌లో రైతు ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాల్సి ఉంటు ంది. వెంటనే ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నంబర్ యాప్‌లో నమోదు చేస్తే రైతు భూమి, బ్యాంకు వివరాలతో పాటు మిగతా సమాచారం కనిపిస్తుంది. అప్పుడే కొనుగోలు చేసిన ధా న్యం బస్తాలు, రకం నమోదు చేస్తారు. ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ లేనట్లయితే యాప్‌లో నమోదు చేయరా దు. సివిల్ సప్లయ్ అధికారులు ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.
రైతులకు అందుబాటులో పోస్టు మన్
మండలంలో 19 గ్రామ పంచాయతీలో నాలు గు పోస్టాఫీసు కార్యాలయాలు ఉన్నాయి. చిలిపిచెడ్‌లో మాత్రమై ఆధార్‌కు మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గ్రామాల్లో రైతులు పోస్టుమన్కు ఫోన్ చేస్తే వారి ఇంటికి వెళ్లి రూ.50 తీసుకొని మొబైల్ నంబర్ ఆధార్‌కు అనుసంధానం చేస్తున్నాడు. లింక్ లేకుండా ధాన్యం విక్రయిస్తే యాప్‌లో వివరాలు నమోదు చేసే వీలుండదు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు. -హరిసింగ్, పోస్టు మన్, చిలిపిచెడ్
మూడు రోజుల్లో అకౌంట్లో డబ్బులు జమ
ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసిన తర్వాత పీపీ సెం టర్ ఇన్చార్జిలకు ఓటీపీ నంబర్ చెప్పడంతో నాకు మూడు రోజు ల్లో ధ్యానం డబ్బులు అకౌంట్ లో జమయ్యాయి. ఆధార్ కార్డు కు మొబైల్ నంబర్ లింక్ లేకపోతే, చిలిపిచెడ్ పోస్టాఫీసులో పోస్ట్‌మన్‌కు రూ.50 ఇస్తే మొబైల్ నంబర్ లింక్ చేశారు.