గోల్నాక : సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్ అవకాశాన్ని స్థానిక పేద విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. గురువారం అంబర్పేట డివిజన్ బాపునగర్లో రోటరీ ఇండియా లిటరసీ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశాకిరణ్ సెంటర్ను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పలువురు ఉపాధ్యాయులు కలసి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించడం అభినందనీయమన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటల నుంచి 7 గంటల వరకు ఒకటవ తరగతి నుంచి పదివ తరగతి వరకు విద్యార్థులకు అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సెంటర్ ప్రతినిధులు ఆర్కే లావణ్య, నిఖిత, టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, ఎరబోలు నరసింహ్మరెడ్డి, రామారావు, లింగారావు, రాగుల ప్రవీణ్పటేల్, కాలేద్, మహేష్, మహమ్మద్గౌస్, దేవేందర్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.