బన్సీలాల్‌పేట్: న్యూబోయిగూడలోని ఐడిహెచ్ కాలనీలో శ్రీ కృష్ణ జన్మాష్టామి ఉత్సవాలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. శ్రీమహాశక్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో చిన్నారుల శ్రీకృష్ణుడి వేషధారణలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ శ్రీకృష్ణుడి చిత్రపటానికి పూజలు నిర్వహించారు.
అనంతరం యువకుల కేరింతలతో ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎల్.వెంకటేశన్ రాజు, శ్రీమహాశక్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకులు గజ్జెల శ్రీను, శివకుమార్, మేకల కళ్యాణ్‌రామ్, మల్లిఖార్జున్, నిరంజన్, రాల్, రోహిణ్, జాన్, శ్రీనివాస్, శివశంకర్‌లు పాల్గొన్నారు.