కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 24: సింగరేణి యాజమాన్యం క్రీడలు, కళలను ప్రోత్సహిస్తుందని సంస్థ డైరెక్టర్లు బలరాం, చంద్రశేఖర్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అన్నారు. కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో శుక్రవారం సింగరేణి- హైదరాబాద్ ఆర్ట్ అండ్ కల్చర్ ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో శిల్ప కళా ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. పది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ప్రజలందరూ తిలకించేందుకు ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. పురాణ ఇతిహాసాలు, యోగ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా హృదయ్ కౌశల్, స్నేహలత ప్రసాద్, రాకేశ్ పట్నాయక్ తదితర శిల్పులు కళాఖండాలు సృష్టిస్తారన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్ట్ అండ్ కల్చర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినోద్‌కుమార్ అగర్వాల్, జీఎం పర్సనల్ బసవయ్య, టీబీజీకేఎస్ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి, ఎమ్మార్జీకే మూర్తి, డీజీఎం పర్సనల్ ధన్పాల్ శ్రీనివాస్, సీనియర్ పీవోలు గట్టు స్వామి, సుశీల్‌కుమార్, వరప్రసాదరావు పాల్గొన్నారు.