కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కేఎస్ క్రిష్ణ ప్రతిష్టాత్మక ది సోసైటీ ఆఫ్ జియోసైంటిస్ట్ అండ్ అలైడ్ టెక్నాలజీస్ట్ (ఎస్జీఏటీ) అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్కు ఎంపికయ్యాడు. కాగా ఆయనకు అవార్డు రావడం పట్ల వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు హర్షం వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ క్రిష్ణ వర్సిటీలోని జీయోఫిజిక్స్ అండ్ హెడ్ సెంటర్ ఫర్ ఎర్త్ , ఓషియన్ అండ్ అట్మాస్పియరిక్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారని, ఈ అవార్డును భువనేశ్వర్లో డిసెంబర్ 18న జరుగ నున్న ఎస్జీఏటీ జనరల్ బాడీ సమావేశంలో అందజేయనున్నట్లు తెలిపారు.
తాను చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని ప్రొఫెసర్ డాక్టర్ క్రిష్ణ తెలిపారు. మైనింగ్ విభాగంలో ఉత్తమ పరిశోధనలకు గాను ఈ అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు.