
కోడేరు, డిసెంబర్ 11 : ఆర్టీసీ బస్సులో జన్మించిన చి న్నారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అనూహ్య కానుక ప్రకటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉషారాణి ప్రసవం కోసం తల్లిగారి ఊరైన కోడేరు మండలం రాజాపూర్‌కు 20 రోజుల కిం దట వెళ్లింది. గత నెల 30న ప్రసవ నొప్పులు రావడంతో కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానకు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అయితే పెద్దకొత్తపల్లికి బస్సు వచ్చే సరికి ఉషారాణికి నొప్పులు ఎక్కువై పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్‌లో వారిని నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించారు. తన సం స్థ సిబ్బంది సాయం చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అ భినందించారు. ఆ చిన్నారికి బస్సులో జీవితకాలం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చిన్నారి, ఆమె తల్లి హైదరాబాద్‌లోని నీలోఫర్ దవాఖాన లో చికిత్స పొందుతున్నారు. ఊషారాణిని ఫోన్లో సంప్రదించగా తన బిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు ఆనందంగా ఉన్నదని చెప్పారు.