
మిడ్జిల్, డిసెంబర్ 24 : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో శ్రీకృష్ణ గీతామందిర్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణార్జున, విఘ్నేశ్వర విగ్రహా ల ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గీతామందిర్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు. కాగా, శ్రీకృష్ణ గీతామందిర్ ప్రారంభం సందర్భంగా యాదాద్రి శంకారానందగిరిస్వాముల ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, మండపారాధన, వాస్తుహోమం, యం త్ర ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అ నంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గీతామందిర్ సభ్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు మండల ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మహేశ్వర్, శివరాములు, యుగేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుధాబాల్రెడ్డి, ఎల్లయ్యయాదవ్, బాలు, జగన్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శేఖర్, జైపాల్‌రెడ్డి, అల్వాల్‌రెడ్డి, ఆచారి తదితరులు పాల్గొన్నారు.
సాయిచంద్‌కు శుభాకాంక్షలు
జడ్చర్ల, డిసెంబర్ 24 : గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిచంద్‌కు శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు పట్టోళ్ల నాగిరెడ్డి, మీనగ శ్రీకాంత్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్‌ఖాన్, పాలాది రామ్మోహన్ ఉన్నారు.