
మణికొండ : నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో పోచమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రారంభ పూజ కార్యక్రమాలు గత మూడు రోజులుగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం గోమాత పూజ, పతిష్ఠాపన అవాహనం, చండీయాగం పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చెవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విచ్ఛేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయకమిటి సభ్యులు మాజీ ఎంపీపీ మల్లేష్, కౌన్సిలర్ అమరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గండయ్య, ప్రతినిధులు వెంకటేశ్, విఠలయ్య, రాజు, విఠల్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.