రామడుగు, డిసెంబర్ 30: దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎంపీపీ కలిగేటి కవిత పేర్కొన్నారు. మండలంలోని కొరటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ కలిగేటి కవిత మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగానే దళిత బంధు పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దళితుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకే దళితవాడల్లో అధికారులు పౌరహక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, అధికారులు దళితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మన్నె దర్శన్రావు, ఎంపీవో సతీశ్‌రావు, ఆర్ఐ రజినీ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, నాయకులు లక్ష్మణ్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలి
గంగాధర, డిసెంబర్ 30: బూరుగుపల్లిలో అధికారులు పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. అంటరానితనం వంటి సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామంలో కుల వివక్ష చూపితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, ఎస్ఐ నరేశ్‌రెడ్డి, సర్పంచ్ సాగి రమ్య, ఆర్ఐ రహీం, నాయకులు దూలం శంకర్‌గౌడ్, గడ్డం స్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొలెపాక స్వామి, ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌కుమార్, అంగన్వాడీ టీచర్ సుజాత, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.