బంజారాహిల్స్ : అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరయిన ఎల్వోసీ పత్రాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శనివారం బాధితుల కుటుంబసభ్యులకు అందజేశారు.
యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న త్రిమూర్తులు అనే వ్యక్తి చికిత్స కోసం రూ.1.50లక్షల ఎల్ఓసీ పత్రాన్ని, నర్సింహ అనే వ్యక్తికి రూ.1లక్ష ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందించారు.
ఈ కార్యక్రమంలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.