
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 11 : ఏండ్ల తరబడి అన్యోన్యంగా ఉన్న ఆ దంపతు ల మధ్య కుటుంబ కలహాలు ప్రాణాలమీదకు తీసుకొచ్చాయి. దీంతో క్షణికావేశంలో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జ డ్చర్ల మండలం ఎక్వాయిపల్లిలో చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథ నం మేరకు.. జడ్చర్ల మండలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి (51), హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు చెందిన కళావతమ్మ అలియాస్ చంద్రకళ (46)కు 1994లో వి వాహమైంది. వీరికి ఇద్దరు శిరీష, శ్వేత కుమార్తెలు ఉండగా.. వీరికి వివాహాలు కూడా చేశారు. గ్రామంలోనే భార్యాభర్తలు వ్యవసాయం చేసేవారు. పెండ్లయి న నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా మె లిగేవారు. ఈ మధ్య కాలంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. శుక్రవారం రాత్రి కూడా గొడవ పడ్డారు. తా గిన మైకంలో భర్త విష్ణువర్ధన్‌రెడ్డి తన భార్యను కొట్డాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మం దు తాగింది. ఇది చూసిన భర్త కూడా భార్యను కొట్టానన్న భయంతో తానూ పురుగుల మందు తాగాడు. వీరిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చుట్టుపక్కల వారు గుర్తించి జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొం దుతూ చంద్రకళ మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో విష్ణువర్ధన్‌రెడ్డిని పాలమూరు జనరల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృ తదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు.