సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 28: కేంద్రం ఒంటెత్తు పోకడను సహించబోమని, వస్త్ర ఉత్పత్తిపై జీఎస్టీ ఎత్తేయాల్సిందేని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా ఉద్యమం ఆపబోమని తేల్చిచెప్పారు. పెంచిన జీఎస్టీకి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజుకు చేరింది. పాలిస్టర్ అసోసియేషన్, డైయింగ్ అసోసియేషన్, మ్యాక్ సంఘాల ప్రతినిధులు మంగళవారం దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వీరికి టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, పట్టణ పద్మశాలీ సంఘం, టీఆర్ఎస్ కార్మిక విభాగం, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుంటే కేంద్రం కార్మికుల నడ్డివిరిచే నిర్ణయాలు తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నూ లు, రసాయనాలపై రాష్ట్రం సబ్సిడీ ఇస్తూ నేతన్నలను ప్రోత్సహిస్తున్నదని, కానీ, కేంద్రం పన్నులపెంపుతో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండల సత్యం, కార్యదర్శి వెల్దండి దేవదాస్, డైయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, కోడం శ్రీనివాస్, మ్యాక్ సంఘాల అధ్యక్షుడు ఎల్దం డి శంకర్, కా ర్యదర్శి పోలు శంకర్, పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, గాజుల బాల య్య, మోర రవి, సంగీతం శ్రీనివాస్, ఆడెపు రవీందర్, తదితరులు పాల్గొన్నారు.