
మెదక్‌రూరల్/ వెల్దుర్తి/పెద్ద శంకరంపేట/చిన్నశంకరంపేట/ చేగుంట/నర్సాపూర్/ అల్లాదుర్గం/మనోహరాబాద్, జనవరి 6 : సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని, రైతు ల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్‌లోని రైతువేదిక వద్ద రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రైతుబంధు సంబురాలను నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అల్లాదుర్గం మండలంలో రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జడ్పీటీసీ సౌందర్యపాల్గొన్నారు. పెద్దచింతకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు రైతుబంధు వారోత్సవాలను నిర్వహించారు. చేగుంట, నార్సింగి మండలాల్లో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చిన్నశంకరంపేటలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వెల్దుర్తి, మాసాయిపేటలతో పాటు ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. మెదక్ పరిధిలోని మచవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మెదక్ డివిజన్ వ్యవసాయశాఖ అధికారి నగేశ్, స్థానిక సర్పంచ్ సంధ్య శ్రీనివాసచౌదరి, ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన, ముగ్గుల పోటీలను నిర్వహంచి బహుమతులు అందజేశారు.
రేపు రైతుర్యాలీ..
రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా రేపు (శనివారం) వెల్దుర్తిలో రైతుర్యాలీ చేపడుతున్న జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు.