
కోహీర్, జనవరి 5 : భూమి అకస్మాత్తుగా కంపించడంతో ఇండ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలతో భయాందోళన చెందారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బడంపేట, గొటిగార్‌పల్లి, బిలాల్పూర్ గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు భూమి కంపించింది. టవర్లు, కార్లు, ఇండ్లలోని బిందెలు కదిలాయి. వాటి ద్వారా వచ్చిన శబ్ధంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే విషయాన్ని ప్రజలు చర్చించుకున్నారు. బయటకు వచ్చి తమ బంధువులు, స్నేహితుల యోగక్షేమాలను ఫోన్‌చేసి అడిగి తెలుసుకొన్నారు. వారం క్రితం కూడా ఇలాంటి భూప్రకంపనలు వచ్చినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడో కంకర మిషన్ల నుంచి శబ్ధం వచ్చినట్లు అనుకున్నారు. కానీ, బుధవారం ఇండ్లలో నుంచి భారీ శబ్ధం రావడంతో తీవ్ర భయాందోళన చెందారు. ఇండ్లకుగానీ, ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు.
ప్రభుత్వానికి నివేదిక అందజేస్తా..
మండలంలో ని బిలాల్పూర్, మనియార్‌పల్లి, గొటిగార్‌పల్లి, బ డంపేట గ్రామాల్లో భూ మి కంపించిందని కొంతమంది నా కు సమాచారం అందించారు. ప్రజల నుంచి వివరాలు తెలుసుకు న్నా. ఎలాంటి నష్టం జరగలేదు. వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.
వేలం నిర్వహిస్తుండగా శబ్ధం వచ్చింది..
బడంపేట రాచన్నస్వా మి దేవాలయానికి భక్తు లు సమర్పించిన ఆవులను బుధవారం వేలం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. మా పక్కన ఉన్న కారు కూడా అటుఇటు కదిలింది. దేవుని దయతో ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు.
చాలా ఆవాజ్ వచ్చింది..
మేము గ్రామ పంచాయతీలో ఉండగా చాలాపెద్ద ఆవాజ్ వచ్చింది. శబ్ధం రావడంతో వెంటనే గ్రామ పంచాయతీ నుంచి బయటకు వచ్చినం. భూ మి కంపించినట్లు అప్పుడు అర్థమయ్యింది. ఎలాంటి నష్టం అయితే జరగలేదు.