
భూత్పూర్, డిసెంబర్ 11 : కొవిడ్ వ్యా క్సినేషన్పై నిర్లక్ష్యం వద్దని డిప్యూటీ డీఎంహెచ్‌వో శశికాంత్ అన్నారు. శనివారం ము న్సిపాలిటీలోని అమిస్తాపూర్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అ న్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూ ర్తి చేయడమే లక్ష్యంగా వైద్యసిబ్బంది పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్ట ర్ సత్యనారాయణ, సీహెచ్‌వో రామయ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
టీకాతో కరోనా కట్టడి
జడ్చర్ల/టౌన్, డిసెంబర్ 11 : టీకాతో కరోనాను కట్టడి చేయవచ్చని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని 1,23,4 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్, అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి కొవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్కులను ధరించడంతోపాటు శా నిటైజర్ వినియోగించాలని సూచించారు. అలాగే పలు వార్డుల్లో కౌన్సిలర్లు, వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. గంగాపూర్ పీహెచ్సీ పరిధిలోని పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను డాక్టర్ రాహుల్ పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, దేవా, చైతన్యచౌహాన్ పాల్గొన్నారు.
వందశాతం పూర్తి చేస్తాం
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 11 : మున్సిపాలిటీలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వం దశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ని కిద్వాయ్పేటలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ వైద్యసిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాక్సి న్ వేస్తున్నట్లు తెలిపారు. కాగా, కిద్వాయ్పేటలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని కమిషనర్ తెలిపారు. ఇందుకు కృషి చేసిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ రఫీక్, మున్సిపల్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, డిసెంబర్ 11 : కరోనా మ హమ్మారిని కట్టడి చేసేందుకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసులు కోరారు. మండలకేంద్రంలో శనివారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించారు. అలాగే బొడగుట్టతండాలో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్‌నాయక్, పంచాయతీ కార్యదర్శులు లోక్‌నాథ్, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, డిసెంబర్ 11 : మండలంలోని పలు గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను స్థానిక పీహెచ్సీ డాక్టర్ ప్రతాప్చౌహాన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, డిసెంబర్ 11 : మండలంలోని వెన్నాచేడ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను తాసిల్దార్ జ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని సూచించారు. కాగా, తాసిల్దార్ కార్యాలయ సిబ్బందితోపాటు డిప్యూటీ తాసిల్దార్ ఇంతియాజొద్దీన్ టీకా వేయించుకున్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలి
దేవరకద్ర, డిసెంబర్ 11 : అర్హులైన ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని పేరూర్ పీహెచ్సీ డాక్టర్ నాగేశ్‌కుమార్ కో రారు. శనివారం కౌకుంట్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేరూర్ గ్రామంలో వందశా తం వ్యాక్సినేషన్ పూర్తయిందని, మిగతా గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ రఘు, ఏఎన్ఎం పరిమళ, ఆశ కార్యకర్తలు రోజమ్మ, సునీత, మాధవి, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.