వెంగళరావుగనర్ : వెంగళరావునగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధురానగర్ స్టేట్‌హోం ఆవరణలోని బాలసదన్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రియ (12) వెంగళరావునగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది.
బుధవారం భోజన విరామ సమయం నుంచి విద్యార్ధిని కనిపించకుండా పోయింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనుంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.