అంబర్‌పేట : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ రెడ్‌బిల్డింగ్ చౌరస్తాలోనూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండేలా ఆయా బస్తీ, కాలనీ ప్రజలు చూడాలని చెప్పారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం బస్తీవాసులు స్థానికంగా వాటర్ పైప్‌లైన్ వాటర్ లీకేజీ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే లీకేజీ సమస్యను వెంటనే పరిష్కరిం చాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, జలమండలి డీజీఎం సతీష్, ఏఈ మజీద్, టీఆర్ఎస్ పార్టీ బాగ్‌అంబర్‌పేట డివిజన్ అధ్యక్షుడు సీహెచ్. చంద్రమోహన్, నాయకులు శ్రీరాములుముదిరాజ్, అప్రోజ్పటేల్, సంతోష్, బాబు, ఘని, శ్రీనివాస్‌యాదవ్, శివాజీయాదవ్, సుధాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.