ఖలీల్‌వాడి/ విద్యానగర్/ బాన్సువాడ, జనవరి 9:బీర్కూర్ పోలీస్ స్టేషన్లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రాజారమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో 31 కేసులు
ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.ఆదివారం నిజామాబాద్ జిల్లా లో 31కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి సుదర్శనం తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగవద్దని సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశారు.ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 55,779 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారి తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో ఆదివారం 30 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగు రికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 31,793 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.