అమీర్‌పేట్ : భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న సనత్‌నగర్ హనుమాన్ దేవాలయ అర్చకుడు విజయేంద్ర శర్మపై సనత్‌నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
70 సంవత్పరాల చరిత్ర ఉన్న సనత్‌నగర్ హనుమాన్ దేవాలయ ప్రతిష్ఠ దిగజారే విధంగా ఆలయ అర్చకుడు విజయేంద్ర శర్మ వ్యవహరిస్తున్న తీరు పట్ల గతంలో మౌఖిక ఫిర్యాదుల వరకే పరిమితమయ్యామని, అయినా పరిస్ధితిలో మార్పు కనిపించడం లేదని దీంతో గత్యంతరం లేక విషయాన్ని దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని వివరించారు.
ఇక్కడి దేవాలయంలో అర్చకులు విజయేంద్ర శర్మ వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ సంఘం ప్రతినిధులు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. సనత్‌నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పుట్నాల రాజన్న నేతృత్వంలో భక్తులు, స్థానిక ప్రముఖులు దేవేందర్‌గౌడ్, కె.శ్రీనివాసరెడ్డి, గౌతమ్‌కుమార్, చందూలాల్, ఆర్.రవి, వంశీ, కన్నయ్య యాదవ్, మల్లేష్‌యాదవ్, నిత్యానంద్, ఆర్.రాజేష్, అంజయ్యగౌడ్, సురభి శ్రీను తదితరులు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.