
మెదక్, జనవరి 8 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మెదక్ టౌన్, మెదక్ మండలం, రామాయంపేట, నిజాంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు రూ.13,58 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మెదక్ పట్టణంలో జమ్మికుంటకు చెందిన మంగ రాణికి రూ.60 వేలు, కౌసల్యపల్లికి చెందిన రజితకు రూ.16 వేలు, మెదక్ మండలం మాచవరం గ్రామానికి చెందిన శ్రీవాస్తవ్‌కు రూ.60 వేలు, చిట్యాల గ్రామానికి చెందిన బాదావత్ సురేశ్‌కు రూ.50 వేలు, రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సుష్మాకు రూ.23 వేలు, రాయిన్‌పల్లి గ్రామానికి చెందిన తిరుపతికి రూ.28 వేలు, శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన లతకు రూ.39,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. హవేళీఘణాపూర్ మండలం సర్ధనకు చెందిన నంద్యాల శ్రీనివాస్‌కు రూ.60 వేలు, తిమ్మాయిపల్లికి చెందిన బండమీది స్వప్నకు రూ.60 వేలు, శమ్నాపూర్‌కు చెందిన పెండ్యాల కాశయ్యకు రూ.60 వేలు, యాదగిరికి రూ.20 వేలు, రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన ఎర్రం అనితకు రూ.60 వేలు, కోనాపూర్‌కు చెందిన తీగుళ్ల భూమయ్యకు రూ.29,500, పాపన్నపేట మండలం గాజులగూడెంకు చెందిన బేగరి కిషన్‌కు రూ.60 వేలు, పొడ్చన్‌పల్లికి చెందిన నాగయ్యకు రూ.60 వేలు, అమృతకు రూ.36 వేలు, గంగుల వైష్ణవికి రూ.47 వేలు, ఎంకేపల్లికి చెందిన సుజాతకు రూ.32 వేలు, తండాకు చెందిన జెత్యకు రూ.48 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, లక్ష్మీనారాయణగౌడ్, కిశోర్, నాయకులు పాల్గొన్నారు.
మరణించిన కుటుంబానికి బీమా చెక్కు…
మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ స్వగృహంలో నవాబుపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త రాజం రాము గతేడాది అక్టోబర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్ ఆరేళ్ల గాయత్రి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.