బడంగ్‌పేట : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాలు ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. కోలాటం వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ర్ట పండుగగా గుర్తించడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత బతుకమ్మకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని వారు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. తెలంగాణ బతుకమ్మ ప్రపంచ ఖ్యాతి గడించిందన్నారు.
ఈ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలిసింద న్నారు. ఈ కార్యక్రమంలో టీకేఆర్ కళాశాల కార్యదర్శి తీగల హరినాథ్‌రెడ్డి, కోశాధికారి తీగల అమర్నాథ్రెడ్డి, అధ్యాప కులు విద్యార్థినీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.