శబరిమాత దివ్యపాదుకా పూజోత్సవం
ఆకట్టుకున్న శోభాయాత్ర
వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
తాడ్వాయి డిసెంబర్ 19: మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత ఆశ్రమంలో వార్షికోత్సవాలు రెండోరోజు ఆదివారం కన్నులపండువగా కొనసాగాయి. ఉదయం 8.35 గంటలకు పూలతో అందంగా అలంకరించిన హంస వాహనంపై శబరిమాత దివ్య పాదుకులను ఉంచి భక్తులు భజనలు, నృత్యాలు చేస్తూ ఊరేగించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆశ్రమం ఎదుట ఉన్న గుట్టపై దివ్య పాదుకా పూజోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎండ్రియాల్, బీదర్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భజన బృందాల కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
ఉత్సవాల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే..
శబరిమాత ఆశ్రమ వార్షికోత్సవాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ఆదివారం పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ఆయనకు శబరిమాత చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ భక్తులు ఉన్న శబరిమాత ఆశ్రమాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైస్ ఎంపీపీ నర్సింహులు, సర్పంచ్ సంజీవులు, సొసైటీ చైర్మన్ కపిల్రెడ్డి, రాఘవరెడ్డి, సాయిరెడ్డి, ఆశ్రమ కమిటీ సభ్యులు ఉన్నారు.