ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో పలు పరిపాలనా పరమైన పదవుల నియామకాన్ని చేపట్టారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
ఓయూ పీఆర్వోగా జువాలజీ విభాగానికి చెందిన డాక్టర్ సి. శ్రీనివాసులు, పీజీఆర్ఆర్సీడీఈ జాయింట్ డైరెక్టర్‌గా సీఎస్ఈ విభాగానికి చెందిన డాక్టర్ వీబీనర్సింహ, సైన్స్‌కళాశాల ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ వీరయ్య, సివిల్‌సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ గణేశ్, కోఆర్డినేటర్‌గా డాక్టర్ సుజాత, యూజీసీ-హెచ్ఆర్డీసీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ విజయలను నియమించారు.
అలాగే అసోసియేట్ డైరెక్టర్‌గా డాక్టర్ లావణ్య, అసిస్టెంట్ డైరెక్టర్‌గా డాక్టర్ సమున్నత, లేడీస్ హాస్టల్ డైరెక్టర్‌గా డాక్టర్ సునీతా దేవి నియమితులయ్యారు. ఈ మేరకు వారికి నియామక పత్రాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా వారిని పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థి నేతలు అభినందించారు.