వనస్థలిపురం : శివారు కాలనీల్లో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, అధికారులతో కలిసి గాయత్రినగర్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. పై కాలనీల నుంచి వస్తున్న డ్రైనేజీ, వరద నీటితో దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. అటవీ శాఖ కాల్వకు అనుగుణంగా బాక్స్ డ్రైన్‌ను నిర్మించాలన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ దరి, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.