ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
వివిధ శాఖల అధికారులతో పట్నం చెరువును సందర్శించిన ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 29 : ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటకులకు కనువిందు చేసే విధంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంతో బుధవారం ఆయన టూరిజం, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరానికి ఇబ్రహీంపట్నం అతి చేరువలో ఉన్నందున ఈ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతే ఆహ్లాదం కోసం తరలివస్తారని ఆయన అన్నారు. చెరువుకట్ట పొడవున ఉన్న కలుపు మొక్కలను తొలగించి చెరువుకట్టను వెడల్పు చేయాలన్నారు. కట్టకిరువైపులా పూలమొక్కలను పెంచాలని సూచించారు. ఇబ్రహీంపట్నం చెరువు తూమువద్ద ఇప్పటికే వందలాదిమంది పర్యాటకులు వచ్చి సేదతీరుతున్నారని, దీనిని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం చెరువు పక్కన పోచారం రోడ్డులో పార్కును రూపొందించాలన్నారు. చెరువులో ఒక బోట్, రెస్టారెంట్ తరహాలో మరో బోట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ఇబ్రహీంపట్నం చిన్నచెరువులో వాకింగ్ పార్కును కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణతో పాటు బోటింగ్ సౌకర్యం కల్పించే విషయంపై త్వరలోనే టూరిజం ఎండీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, కమిషనర్ యూసఫ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి ఇరిగేషన్, టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి
మంచాల : ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పెద్దమ్మతల్లి, గంగమ్మతల్లి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, ఎంపీపీ జాటోతు నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చీరాల రమేశ్, బహదూర్, నాయకులు జగన్‌రెడ్డి, రావుల శంకర్, గడ్డం రాజేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.