సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 29 : కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న విషయం తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలిసి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 7,32,885 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో మొదటి డోస్ 4,64,876 మంది, రెండో డోస్ 2,68,009 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 13,55,667 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అర్బన్ ఏరియాలో 93.75శాతం, రూరల్ ఏరియాలో 94.67శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోగా మొత్తం 94.38 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.
20 రోజుల్లో 1,33,369 మందికి వ్యాక్సిన్..
ఈ నెల 9వ తేదీన మంత్రి హరీశ్‌రావు ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. జిల్లాలో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేయడంతో వ్యాక్సినేషన్ మరింత వేగవంతమైంది. ఈ నెల 9వతేదీ నుంచి 28వ తేదీ వరకు అంటే 20 రోజుల్లో 1,33,369 మందికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. ఇందులో మొదటి డోస్ 27,188, రెండో డోస్ 1,06,181 మందికి టీకా వేశారు. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున జరగడం గమనార్హం. మంత్రి ఆదేశాల మేరకు త్వరలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు వైద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో 94.38శాతం వ్యాక్సినేషన్ పూర్తి
జిల్లాలో ఇప్పటి వరకు 94.38శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇప్పటి వరకు 13,55,667 మందికి వ్యాక్సిన్ వేశాం. ఇందులో మొదటి డోస్ 9,11,736, రెండో డోస్ 4,43,931 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని పీహెచ్సీ, సబ్ సెంటర్లలో వ్యాక్సిన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు అర్బన్ ఏరియాలో 93.75శాతం, రూరల్ ఏరియాలో 94.67శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. జిల్లాలో మొత్తం 94.38 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాం. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుని కరోనా నుంచి రక్షణ పొందాలి.