
మెదక్ అర్బన్, నవంబర్ 29: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వారికి న్యాయం చేస్తామని ఎస్పీ చందనదీప్తి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. మాసాయిపేట మండలం బొమ్మరం గ్రామానికి చెందిన పిట్టల చిన్న చెన్నయ్య , పిట్టల కళావతి , పిట్టల రాజమ్మలకు బొమ్మరం గ్రామంలో సర్వే నెం 863లో 2 ఎకరాల 11 గుంటలు, సర్వే నెం 863 ఈ1లో 1ఎకరం 14 గుంటలు , సర్వే నెం 863 అ లో 2 ఎకరాలు , 863 ఇ లో 1 ఎకరం, సర్వే నెం 863 ఈ2లో 30 గుంటలు భూమి ఉంది. అట్టి భూమిని ఇదే గ్రామానికి చెందిన ఇంద్రసేనారెడ్డి, నందయ్య, లక్ష్మారెడ్డిలు అక్రమంగా ప్రవేశించి స్థలంలో కడీలు పాతినట్లు ఎస్పీకి తెలిపారు. దీంతో వారిపై చర్యలు తీసుకొని న్యా యం చేయాలని సీఐ నాగార్జున్గౌడ్ను ఆదేశించారు. అక్కన్నపేట గ్రామానికి చెందిన రుచిత రామాయంపేట మండలం గోలప్పర్తి గ్రామానికి చెందిన ఎర్రం సాగర్ను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నెల తర్వా త అత్తా మామలు ,ఆడపడుచులు మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీంతో వారు తన భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో బాగా చూసుకుంటున్నాడని తెలిపింది. ఆ రోజు నుంచి తన భర్త కన్పించడం లేదని ,తన భర్త ఎక్కడ ఉన్నాడో, అత్తా మామలకు తెలు సు కానీ ,వారు చెప్పడం లేదని ,తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని ఆమె ఎస్పీని కోరారు. ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్సై, సీఐలతో మాట్లాడి ఫిర్యాదుకు తగు న్యాయం చేయాలని సూచించారు.
జిల్లాకు మంచి పేరు తీసుక రావాలి ;అదనపు ఎస్పీ (అడ్మిన్)బాలస్వామి
ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్ అటాచ్) బాలస్వామి ఆధ్వర్యంలో సోమవారం డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సెక్షన్లకు సంబంధించిన ఏ మైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఇచ్చే ట్రైనింగ్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. డీసీఆర్బీ , ఐటీ కోర్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు.
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
మెదక్ రూరల్, నవంబర్ 29: ప్రతి విద్యార్థి సైబర్ నేరాలు, బాలికల సంరక్షణ చట్టాలను తెలుసుకోవాలని మెదక్ రూరల్ ఎస్సై కృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మాచవరం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయడు, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు.