ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మున్సిపాలిటీలో రూ.2.85 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం
తుర్కయాంజాల్, డిసెంబర్ 28 : సమిష్టి భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడ, తొర్రూర్, మునగనూర్, ఇంజాపూర్ గ్రామాల్లోని వివిధ వార్డుల్లో రూ.2.85 కోట్లతో చేపట్టనున్న యూజీడీ, సీసీ రోడ్లు, శ్మశాన వాటిక ప్రహరీ, స్టార్మ్ వాటర్ లైన్ల ఏర్పాటు వంటి వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో ప్రజల సహకారం తీసుకొని పని చేయాలని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని, గెలిచాక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. తుర్కయాంజాల్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్ గ్రామానికి చెందిన రైతు మేకం భిక్షపతి గుండెపోటుతో ఈ మధ్య మృతి చెందాడు. రైతు భీమా నుంచి వచ్చిన రూ.5 లక్షల చెక్కు ప్రొసీడింగ్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంగళవారం మృతుడి భార్య మేకం అలివేలుకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధారాంరెడ్డి, వైస్ చైర్ పర్సన్ హరిత, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షురాలు మంగమ్మ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు రమావత్ కల్యాణ్ నాయక్, ఐలయ్య, కౌన్సిలర్లు కంబాలపల్లి ధన్‌రాజ్, జ్యోతి, బాల్‌రాజ్, సంగీత, వేమలు స్వాతి, బొక్క రవీందర్ రెడ్డి, శ్రీలత, ఉదయశ్రీ, అనిత, హరిత, మాధవి, కీర్తన, భాగ్యమ్మ, కవిత, కాకుమాను సునీల్, డైరెక్టర్ సామ సంజీవ రెడ్డి, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి, నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, కందాళ బలదేవ రెడ్డి, బిందు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.