అన్ని గ్రామాలకూ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా
ప్రతి ఇల్లు, కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి
దోహదపడిన పల్లెప్రగతి కార్యక్రమం
ఫలించిన అధికారుల ప్రణాళిక
వరంగల్, డిసెంబర్ 26(నమస్తేతెలంగాణ) : పచ్చదనం, పరిశుభ్రతతో రాష్ట్ర ప్రభుత్వం పల్లెల రూపురేఖలను మారుస్తున్నది. దీంతో పల్లెలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. తాజాగా బహిరంగ మల విజర్జన రహితం(ఓడీఎఫ్)తో పాటు ఇతర ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఓడీఎఫ్ ప్లస్ హోదా దక్కించుకున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 17,684గ్రామాలకు కేం ద్రం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా ప్రకటించగా వీటిలో తెలంగాణకు చెందిన గ్రా మాలే ఏకంగా 6,537 ఉన్నాయి. వీటి లో వరంగల్ జిల్లా నుంచి వంద శాతం గ్రామాలు ఉండడం విశేషం. జిల్లాలోని 323 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలన్నీ ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల జా బితాలో ఉన్నట్లు అధికారులు తెలిపా రు. గతంలో ప్రతి ఇంటి ఆవరణలో మ రుగుదొడ్డి నిర్మాణం పూర్తి కాగానే జిల్లా ను నూరుశాతం ఓడీఎఫ్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా లభించేలా ఆయా గ్రామంలో ఇతర ప్ర మాణాలు కూడా పాటించాలని ఆదేశా లు జారీ చేసింది. దీంతో పాఠశాల, అం గన్వాడీ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లు నిర్మించడం, ఇం టింటి నుంచి చెత్తను సేకరించడం, ట్రా క్టర్ సమకూర్చడం, డంపింగ్‌యార్డుల్లో తడి, పొడి చెత్తను వేరు చేయడం, వై కుంఠధామాలు నిర్మించడం, నీరు నిల్వకుండా ప్రతి ఇంటి ఆవరణతో పాటు గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంత లు నిర్మించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి అమలయ్యే అధికారులు చూశారు. పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. పక్కా ప్రణాళికతో అడుగులు వే సి అనుకున్నది సాధించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడంలో సఫలీకృతమయ్యా రు. కలెక్టర్ బీ గోపి ఎప్పటికప్పుడు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పనుల పురోగతిపై సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు.
కలిసొచ్చిన పల్లెప్రగతి..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదాను సాధించేందుకు కలిసొచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం గ్రామాల్లో చెత్త సేకరణ కో సం ఇంటింటికీ చెత్త బుట్టలను అందజేసింది. తడి, పొడి చెత్తను వేరు చేయడం పై ప్రజలకు అవగాహన కల్పించింది. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించడానికి పంచాయతీకో ట్రాక్టర్ సమకూర్చింది. ప్రతి జీపీలో డంపింగ్‌యార్డు నిర్మించింది. ఇక్కడ తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నాయి. వైకుంఠధామం నిర్మించి, నిర్వహణ కో సం నెలనెలా నిధులు ఇస్తున్నది. ఇవన్నీ గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదాను సాధించేందుకు దోహదపడ్డాయి. నీరు నిల్వకుండా గ్రామాల్లో ప్రతి ఇల్లు, ప్ర భుత్వ కార్యాలయాల ఆవరణలో, క మ్యూనిటీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు నిర్మించారు. జీపీ కార్యాలయం, ప్ర భుత్వ పాఠశాల, కళాశాల, అంగన్వాడీ సెంటర్, పీఏసీఎస్, ప్రాథమిక ఆరోగ్య, ఉప కేంద్రాల ఆవరణలో మరుగుదొ డ్లు, ఇంకుడుగుంతలు నిర్మించారు. ఈ హోదా దక్కేందుకు సర్పంచ్‌లు, పాలకవర్గం, కార్యదర్శి, సిబ్బంది, ఎంపీవోలు కీలకపాత్ర వహించారు. డీఆర్డీవో ఎం సంపత్‌రావు, డీపీవో ప్రభాకర్‌తో పా టు డీఎల్పీవోలు, గ్రామీణాభివృద్ధి సం స్థ అధికారులు, సిబ్బంది తమ వంతు బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక సం స్థల కోసం ప్రభుత్వం నియమించిన అ దనపు కలెక్టర్ హరిసింగ్ గ్రామాల్లో ప ర్యటించి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పనులను పరిశీలించారు. జిల్లాలోని వంద శాతం జీపీలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా పొందడంపై ప్రజలు, అధికారుల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.