కోదాడ, నవంబర్ 14 : విద్యుత్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కొనియాడారు. ఆదివారం పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన కార్తిక వనభోజన మహోత్సవంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్యను అధిగమించడంలో ఉద్యోగుల శ్రమ ఎంతో ఉందన్నారు. సాగుకు నిరంతరం ఉచిత విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది అన్నారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు ఎమ్మెల్యేలను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎంపీపీ చింతా కవితారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు వనపర్తి లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్, ఉద్యోగ సంఘం నాయకులు నిరంజన్, యూసుఫ్, రమేశ్, మల్లికార్జున్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
సునీల్ కుటుంబాన్ని ఆదుకుంటాం
పట్టణానికి చెందిన సునీల్ ఇటీవల విద్యుదాఘాతంతో మృతిచెందగా అతడి కుటుంబాన్ని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ పరామర్శించారు. సునీల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, పాండు, ప్రవీణ్, చింతాబాబు మాదిగ, సంపేట ఉపేందర్, ఈదుల కృష్ణయ్య ఉన్నారు.
నిత్యావసరాలు పంపిణీ
పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. చైర్మన్ పందిరి నాగిరెడ్డి, జేఏసీ నాయకులు నాగమణి, కౌన్సిలర్లు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.