
మెదక్ రీజియన్ నుంచి ఏర్పాటు
అతి తక్కువ ధరతో అందుబాటులో ఆర్టీసీ సేవలు
8 డిపోల నుంచి బస్సులు..
సంగారెడ్డి, నవంబర్ 13: శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. మెదక్ రీజియన్ నుంచి 8 డిపోల నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇతర ప్రైవేట్ వాహనాల మాదిరిగా ఆర్టీసీ బస్సులను శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మెదక్ రీజియన్ పరిధిలో ఉన్న 8 ఆర్టీసీ డిపోల పరిధిలో శబరిమలకు బస్సులను ఏర్పాటు చేశారు. అతి తక్కువ ధరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. మెదక్ రీజియన్ పరిధిలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల కోసం బక్ చేసుకోవాల్సి ఉంటుంది. సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను సీటింగ్ కెపాసిటీతో అందుబాటులో ఉంచారు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటే స్వాములకు ఆర్టీసీ నేస్తం కింద, ఏటీబీ ఏజెంట్లకు రోజుకు రూ.300 కమీషన్ ప్రకటించారు.
8 డిపోల నుంచి బస్సులు..
మెదక్ రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి శబరిమలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. రీజియన్‌లోని సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్ డిపోల నుంచి బస్సులను అందుబాటులో ఉంచారు. సూపర్ డీల
క్స్‌లో 36 మంది సీటింగ్ కెపాసిటీతో అతి తక్కువ ధర కిలోమీటర్‌కు రూ.48.96ల ధరను నిర్ణయించారు. అదేవిధంగా గంటకు రూ.300లు వెయిటింగ్ చార్జీ విధించనున్నారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో బస్సు పయనించనున్నదని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అదేవిధంగా డీలక్స్ బస్సులో 40 మంది కెపాసిటీకి కిలోమీటర్‌కు రూ.47.2, 48 మంది కెపాసిటీకి కిలోమీటర్‌కు రూ.56.64లుగా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్‌కు 49 మంది సీటింగ్ కెపాసిటీతో కిలోమీటర్‌కు రూ.52.43గా ధరను నిర్ణయించారు. బస్సుల్లో సీటింగ్ కెపాసిటీతో పాటుగా ఒక వంట మనిషి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌ను అనుమతిస్తారు. బస్సులోపల లగేజీ పెట్టుకునేందుకు రెండు సీట్లను తొలగించనున్నారు. వాటితో పాటుగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో టోల్‌గేట్‌ను బస్సును బక్ చేసుకున్న వారే చెల్లించాల్సి ఉంటుంది.