
కొండాపూర్, డిసెంబర్ 3 : నియోజకవర్గవ్యాప్తంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం సమీపంలోని ఎస్ఎంఆర్ రాయల్ అపార్ట్మెంట్ దగ్గర తలెత్తిన డ్రైనేజీ సమస్యను డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, ఇంజినీరింగ్, జలమండలి విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, జలమండలి మేనేజర్ సుబ్రహ్మణ్యం, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు రాజు యాదవ్, ఉరిటి వెంకట్రావ్, వెంకటేశ్, రవీందర్, రాంబాబు, ఎండీ ఇబ్రహీం, కృష్ణ యాదవ్, కాశీనాథ్, రమేశ్, వేణుగోపాల్, రమణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
నాలా విస్తరణతోనే ముంపు సమస్యకు ముగింపు
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న నాలా విస్తరణ పనులను, భీముని కుంట చెరువు వద్ద జరుగుతున్న పనులను ఇక్కడి రాంకీ పెరల్ వద్ద కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులతో కలిసి విప్ గాంధీ శుక్రవారం పరిశీలించారు. ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నాలా విస్తరణను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డీఈ రాంచందర్, ఈఈ గోవర్ధన్, ఏఈ సుభాష్, మహదేవ్, పార్టీ నేతలు కాశీనాథ్, ఇబ్రహీం, వాసు దేవ్, పోశెట్టి, రాంకీ వాసులు ప్రేమ్‌కుమార్, సుబ్రహ్మణ్యరెడ్డి, సురేశ్‌బాబు, బాలమూర్తి, అమర్‌రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.