రూ.3.50 కోట్లతో పనులు జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి
పెద్దేముల్, డిసెంబర్ 3 : మండలానికి రూ.3.50 కోట్ల జడ్పీ నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ.10 లక్షల జడ్పీ నిధులతో నిర్మించిన నూతన అంగన్వాడీ, రూ.15 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.15 లక్షలతో గెస్ట్ హౌజ్, రూ.7 లక్షలతో మారేపల్లిలోబస్ షెల్టర్, రూ.5 లక్షలతో రుద్రారంలో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో గాజీపూర్‌లో అంగన్వాడీ భవనం, రూ.3 లక్షలతో రేగొండిలో సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ.5 లక్షలతో మంబాపూర్లో నిర్మించనున్న మహిళ మండలి భవనానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ మండలంలో సుమారు రూ.1 కోటి జడ్పీ నిధులతో 5 గ్రామాల్లో పలు రకాల అభివృద్ధి పనులను ప్రారంభించామని, గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. ప్రతి మండలానికి ఒక అతిథి గృహాన్ని మంజూరు చేసి నిర్మించినట్లు చెప్పారు. అన్ని మండలాల్లో సీసీ రోడ్లు, పలు రకాల భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు హైదర్, బల్వంత్‌రెడ్డి, ద్యావరి విజయమ్మ, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్ పి.లక్ష్మారెడ్డి, డీవై నర్సింహులు, మహిపాల్‌రెడ్డి, జడ్పిటీసీ ధారాసింగ్, ఎంపీడీవో లక్ష్మప్ప, టీఆర్ఎస్ నాయకులు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.