
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
పద్మశ్రీ కనకరాజుకు సన్మానం
నిర్మల్ అర్బన్, జూన్ 3 : తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల పింఛన్ మంజూరు చే యడంపై గుస్సాడీ కళాకారుడు, పద్మశ్రీ కనకరా జు క్యాంప్ కార్యాలయంలో మంత్రిని గురువా రం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఐకేరెడ్డి దంపతులు కనకరాజుకు శాలువా కప్పి సన్మానించారు. ప్రభు త్వం తరఫున ఇల్లు కట్టించి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చూడాలని కనకరాజు మంత్రిని కోరగా, సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. కార్యక్రమం లో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మర్లవాయి సర్పంచ్ ప్రతిభా వెంకటేశ్వర్ రావు, ఆదివాసీ నాయకులు ఆత్రం భుజంగరావు, ఆత్రం శంకర్, టీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్ ఖాన్, జుగ్నాక దేవ్ ఉన్నారు.
రైతువేదిక ప్రారంభం..
నిర్మల్ టౌన్, జూన్ 3 : పట్టణంలోని వ్యవసా య మార్కెట్ కార్యాలయంలో రూ.20 లక్షల తో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ఐకేరెడ్డి ప్రారంభించారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొంగరి నర్మదా ముత్యంరెడ్డి, నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రైతుబంధు కమిటీ జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, ఎంపీ పీ రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రా జేందర్, మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రా ము పాల్గొన్నారు.