హాజరైన మంత్రి సబితాఇంద్రారెడ్డి,
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
పూజలు చేసిన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 1 : ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వరుణార్చనహోమం వైభవంగా ముగిసింది. ఉదయం 6:30గంటలకు గణపతిపూజ, గోపూజ, 108కలశాలకు ప్రత్యేక పూజలు, వరుణ దేవుడికి అర్చన, శివలింగానికి అభిషేకం, అనంతరం వరుణహోమం నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానానికి చెందిన 30మంది పండితులతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సహకార సంఘాల అధ్యక్షులు, రైతుబంధు సమితి సభ్యులు, పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దంపతులు, ఆయన కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు శివలింగానికి పూజలు, అభిషేకాలు చేశారు. ఎన్నో ఏండ్లుగా ఎండిపోయిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండటంతో ఈ వరుణార్చన హోమాన్ని నిర్వహించారు.
ఘనంగా పూర్ణాహుతి..
పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆయన సతీమణి ముకుంద, ఆయన కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, సోదరులు ప్రభాకర్‌రెడ్డి, జయానంద్‌రెడ్డి, కుమార్తె శీతల్, కోడలు మౌనికలతో పాటు ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వేదపండితులను ఘనంగా సన్మానించారు.
యజ్ఞ యాగాలతో సత్ఫలితాలు : మంత్రి సబితాఇంద్రారెడ్డి
యజ్ఞ యాగాలతో ఫలితాలు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నిర్వహించిన వరుణార్చనయాగంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురాతనకాలంలోనూ యజ్ఞయాగాలు నిర్వహించి ఫలితాలు సాధించారని అన్నారు. నేడుకూడా ప్రతిఒక్కరూ భక్తిభావన అలవర్చుకోవాలని ఆమె అన్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవడం వల్లనే కరువు ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయన్నారు. దీంతో మత్స్యకారులకు ఉపాధి మెరుగైందని, అలాగే, గ్రామాల్లో భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గత కొన్నేండ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడం వలన తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రభుత్వం హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున చెట్లు నాటడం వలన ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురిశాయన్నారు. నియోజకవర్గంలో వర్షాలు కురియాలంటూ 2011లో వరుణయాగం నిర్వహించామని ఆయన అన్నారు. ఈ సంవత్సరం కురిసిన వర్షాలతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువుతో పాటు నియోజకవర్గంలోని అన్ని చెరువు, కుంటలు నిండుకుండల్లా మారాయని అందుకు వరుణదేవుడికి కృతజ్ఞతగా వరుణార్చన, అభిషేకహోమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు..
వరుణార్చన హోమానికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీచైర్‌పర్సన్ అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, సత్తువెంకటరమణారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ ముత్యంరెడ్డి, జేపీ శ్రీనివాస్, బర్ల జగదీశ్‌యాదవ్, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవంతి, చెవుల స్వప్న, వైస్చైర్మన్లు ఆకుల యాదగిరి, కోరె కళమ్మ జంగయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్‌గౌడ్, రమేశ్, కిషన్‌గౌడ్, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు అల్వాల వెంకట్‌రెడ్డి, కొప్పు జంగయ్య, కృష్ణారెడ్డి, సహకారసంఘం చైర్మన్లు సుదర్శన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పుల్లారెడ్డి, రాష్ట్ర ఉత్తమరైతు అంజిరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, సీఐలు సైదులు, వెంకటేశ్‌గౌడ్, నరేందర్, లింగయ్య, స్వామి, కృష్ణంరాజు, విజయ్, ఎంకేఆర్ ఫౌండేషన్ కార్యదర్శి జెర్కోని రాజు, సభ్యులు విజయ్‌కుమార్, పాతూరి రాజేశ్, శివసాయి, జగదీశ్, శేఖర్, జలందర్నాయక్, విజయ్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు నియోజకవర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.