షాబాద్, డిసెంబర్ 1: రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీ ఆర్ ధ్యేయమని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, ఎంపీ పీ కోట్ల ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నా నర్సింహారెడ్డితో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంటల సాగుపై అవ గాహన కల్పించేందుకు రూ. 22లక్షలతో రైతువేదికలు నిర్మా ణం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. క్లస్టర్ల వారీగా రైతులకు సమావేశాలు నిర్వహించి పంటల సాగుపై అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు స్ప ష్టం చేశారు. యాసంగి లో రైతులు వరికి బదులు ప్రత్యా మ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీని వాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు నర్సింగ్‌రావు, గ్రామ సర్పంచ్ మునగపాటి స్వరూ ప, ఎంపీటీసీ వనిత, ఏవో వెం కటేశం, ఏపీఎం నర్సింహులు, వీఆర్వో గోపాల్, టీఆర్ఎస్ నా యకులు నర్సింహారెడ్డి, వెంకటేశ్, రాందేవ్యాదవ్, నర్సిం హులు, సంజీవరెడ్డి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ
ఆమనగల్లు,డిసెంబర్1: ఆమనగల్లు పట్టణంలో సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డీటీ హైదర్ అలీఖాన్ ఆక స్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం క్రయవిక్రయాలను పరి శీలించారు. ఇప్పటి వరకు కోనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యం వివరాలపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బం దులు లే కుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్ డీటీ కి విన్నవించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు జోగువీరయ్య, వైస్ చైర్మన్ సత్యం, కార్యదర్శి దేవేందర్ పాల్గొన్నారు.
ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దు
మంచాల డిసెంబర్1: రైతులు దళారులకు ధాన్యాన్ని విక్ర యించొద్దనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిం దని మండల ప్రత్యేకాధికారి జిల్లాపరిషత్ డిప్యూటీ సీఈ వో రంగారావు అన్నారు. బుధవారం మంచాల మండలం బోడ కొండ, ఆరుట్ల,మంచాలలోన వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఆయన తనిఖీ చేసి రైతుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పం డిం చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.