e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home జిల్లాలు మెదక్‌-అక్కన్నపేట రైల్వే పనులకు రూ.10 కోట్లు మంజూరు

మెదక్‌-అక్కన్నపేట రైల్వే పనులకు రూ.10 కోట్లు మంజూరు

మెదక్‌, డిసెంబర్‌ 1 : మెదక్‌ ప్రజల చిరకాల ఆకాంక్ష త్వరలో నెరవేరనున్నది. ఏండ్ల నాటి కల.. ఎట్టకేలకు నెరవేరనున్నాయి. మెదక్‌-అక్కన్నపేట రైల్వేలైన్‌కు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌-అక్కన్నపేట రైల్వే పనులకు నిధులు మంజూరు చేసింది. అక్కన్నపేట నుంచి మెదక్‌ వరకు ఉన్న 17 కిలోమీటర్ల నూతన లైన్‌ కోసం రూ.120 కోట్లను విడుదల చేసింది. ఆ తర్వాత పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ బుధవారం రూ.10 కోట్లను మంజూరు చేసినట్లు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నిధులతో రైల్వే లైన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్‌-అక్కన్నపేట రైల్వే లైన్‌ పనులకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, అభివృద్ధి పనులకు సహకరించిన మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement