
రామాయంపేట, నవంబర్ 30 : వరి ధాన్యం దళారుల పాలు కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయాలు జరుపాలని రామాయంపేట మండల ప్రత్యేక అధికారి రామారావు శ్రీనివాసరావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణ శివారుతో పాటు మండలంలోని కోనాపూర్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రామాయంపేట మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని కచ్చితంగా ప్రభుత్వం కొంటుందన్నారు. అధికారుల వెంట పీఏసీఎస్ సీఈవోలు పుట్టి నర్సింహులు, మల్లారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు ఉన్నారు.
రైతులకు ఇబ్బందులు కల్గించొద్దు..
నర్సాపూర్, నవంబర్ 30 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని రాష్ట్ర మార్కెట్ కమిటీ జాయింట్ డైరెక్టర్ ఇఫ్తేకార్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణం లోని మార్కెట్ యార్డును రాష్ట్ర మార్కెట్ కమిటీ జాయింట్ డైరెక్టర్ ఇఫ్తేకార్, డీఎం వో(డిస్ట్రిక్ మార్కెట్ ఆఫీసర్) రియాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అనసూ య అశోక్‌గౌడ్, డైరెక్టర్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
వెంటనే కొనుగోళ్లు చేయండి
అల్లాదుర్గం, నవంబర్ 30 : ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని మెదక్ ఆర్డీవో సాయిరాంకు మంత్రి హరీశ్‌రావు ఫోన్లో ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా 161 జాతీయ రహదారి, అల్లాదుర్గం మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రైతులు రాస్తారోకో చేశారు. రైతులు రాస్తారోకో చేస్తున్న సమయంలో అదే జాతీయ రహదారిపై గుండా నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు విషయం తెలుసుకొని రైతుల వద్దకు వచ్చారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, ధాన్యం త్వరగా కొనుగోలు చేసేలా చూడాలని రైతులు మంత్రికి వేడుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి అక్కడి నుంచే మెదక్ ఆర్డీవో సాయిరాంతో ఫోన్లో మాట్లాడి గంటలో అధికారులు ఇక్కడికి వచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో ఆందోళనను విరమించారు.