
సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 30 : పిల్లలను పెంచలేకపోతే శిశుగృహలో అప్పగించాలని డీడబ్ల్యూవో పద్మావతి అన్నారు. మంగళవారం ఇంటర్నేషనల్ అడాప్షన్ మంత్లో భాగంగా డీడబ్ల్యూవో ఆధ్వర్యం లో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన ఆవరణలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద ఊయల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ పిల్లలను పెంచి, పోషించలేని వారు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఊయల్లో వదిలివేయాలన్నారు. శిశుగృహలో చిన్నారులను పెంచి, పిల్లలు లేని వారికి దత్తత ఇస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో శశాంక్ దేశ్పాండే, ఎస్ఎన్సీయూ హెచ్వోడీ అశోక్ ముత్కని, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ విజయశంకర్, విష్ణుమూర్తి, డీసీపీవో రత్నం, పీవో ఎన్టీసీ లింగం, శిశుగృహ మేనేజర్ మొగులయ్య, శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.
జహీరాబాద్ ఏరియా దవాఖానలో ఊయల ఏర్పాటు
జహీరాబాద్, నవంబర్ 30: జహీరాబాద్ ఏరియా దవాఖానలో శిశువుల సంరక్షణ కోసం ప్రత్యేక ఊయలను ఏర్పాటు చేశామని ఐసీడీఎస్ సుపర్వైజార్ సునీతబాయి తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఏరియా దవాఖానలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఊయలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఏరియా దవాఖాన వైద్యులు శేశురావు, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఔట్రీచ్ వర్కర్ శ్రావణ్గౌడ్, వైద్య సిబ్బంది సువర్ణ, శోభారాణి, గౌస్, తానాజీ ఉన్నారు.