
మండుటెండలోనూ చల్లదనాన్ని అందించే తేలియా రుమాలుది చేనేతలో ప్రత్యేక స్థానం. గల్ఫ్ దేశాల్లో మన విశిష్టతను చాటుతున్న తేలియా రుమాలుకు సహజసిద్ధ రంగులద్ది మరింత గుర్తింపు తీసుకొస్తున్నారు పుట్టపాకకు చెందిన అయిటిపాముల నీరజ.ఒకే చీరెలో.. 121 డిజైన్లు.. 121 రంగులు! అదీ చేనేత మగ్గంపై!! వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ!!! పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య రెండేండ్ల శ్రమ ఫలితమిది. నిలువు-పేకల కలబోత డబుల్ ఇక్కత్ డిజైన్‌ను చూస్తే మనసు పడని మగువ ఉండదేమో! సహజ రంగులతో, విభిన్న డిజైన్లలో డబుల్ ఇక్కత్ చీరెలు నేస్తూ.. విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కర్నాటి నారాయణ. …ఇంతటి కళా నైపుణ్యంతో చేనేత ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్న మన చేనేత కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు దక్కింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో వారిని సత్కరించనున్నది. చేనేత ఇక్కత్ వస్ర్తాలకుప్రపంచ ఖ్యాతిబెడ్షీట్స్, లుంగీల తయారీకి సైతం ప్రసిద్ధ్దిగాంచిన జిల్లాఇక్కడి వస్ర్తాలకు దేశ, విదేశాల్లో యమ క్రేజీ జాతీయ పురస్కారాలతో విశ్వవ్యాప్తం అయిన చేనేత ఖ్యాతిపురస్కారాలతో చేనేత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న చేనేత కళాకారులు జిల్లాలో నలుగురు చేనేత కళాకారులకు వరించిన కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులుచేనేత రంగానికి పూర్వ వైభవం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నేడు జాతీయ చేనేత దినోత్సవం
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అగ్గిపెట్టెలో పట్టేంత చీరెను తయారు చేసిన ఘనత మన నేతన్నలదే. ఈ క్రమంలో జిల్లాకు చెందిన కొందరు కార్మికులు వస్ర్తాల తయారీలో తమకంటూ ప్రత్యేకతను చాటి అవార్డులను సొంతం చేసుకోవడం ద్వారా చేనేత ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేశారు. సంప్రదాయ పరంగానే కాకుండా.. మారు తున్న అభిరుచులకి.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చేనేత కళాకారులు తమ కళను, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన ఎంతోమంది కళాకారులు పద్మశ్రీలతోపాటు, జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. తాజాగా..జిల్లాకు చెందిన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కర్నాటి నారాయణ, సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన అయిటి పాముల నీరజ, గంజిపద్మరేఖ, భూదాన్‌పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య విభిన్నమైన డిజైన్లతో చీరెలను తయారు చేసి చేనేత కీర్తిని మరోసారి చాటారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందుకుంటున్న చేనేత కళాకారుల ప్రతిభపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.”దేశ, విదేశాలకు ఎగుమతి
అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించిన పోచంపల్లి వస్ర్తాలు, డిజైన్ల పట్ల దేశ విదేశాల్లో మగువలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పిలవబడే పోచంపల్లి చేనేతలో కాటన్, పట్టు, సికో వస్ర్తాలకు ప్రసిద్ధి. వీటిలో ఇక్కత్ పట్టు చీరెలకు గిరాకీ ఎక్కువ. అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఇక్కడ తయారైన వస్ర్తాలు ఎగుమతి అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు, రాజకీయ నాయకులు, ఇతర దేశాల నుంచి వచ్చిన మహిళలు సైతం పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన చీరెలంటే మక్కువ చూపిస్తారు. ఇందిరాగాంధీ, ప్రతిభాపాటిల్ వంటి ప్రముఖులు పోచంపల్లి చీరెలను కట్టినవాళ్లే. అమెరికా అధ్యక్ష భవనం, బ్రిటన్ శాసనసభ అలంకరణ కోసం పోచంపల్లి వస్ర్తాలను ఉపయోగించడం..పోచంపల్లి డిజైన్‌కు ఉన్న ఘనతను తెలియజేస్తున్నది. ఒకప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లోనే వస్ర్తాలు తయారవ్వగా.. ఇప్పుడు విభిన్న డిజైన్లలో అన్ని రంగుల్లోనూ నేస్తున్నారు.
సహజ రంగులతో తేలియారుమాల్..
సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 6: మండలంలోని పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యానికి అవార్డులు గీటురాయిగా నిలిచాయి. ఇప్ప టి వరకు రెండు పద్మ శ్రీ అవార్డులతో పాటు పలు జాతీయ అవార్డులు సైతం వరించాయి. ఇక్కడ ఆవిష్కరించిన తేలి యారు మాలు, డబుల్ ఇక్కత్ డాబీబోన్ చీరె, డబుల్ ఇక్కత్ డాబీ బోన్ దుబ్బటి సహా పలు వస్ర్తాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యం లో ప్రకృతి సిద్ధమైన రంగులతో తేలియా రుమా లు రూపొందించిన అయిటిపాముల నీరజ కొం డా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు.
చల్లచల్లని తేలియారుమాలు..
మండుటెండలో సైతం చల్లదనాన్ని అందించే తేలియా రుమాలు తయారీ చాలా ప్రత్యేకమైనది. ఆముదం పొట్టు బూడిద, వృక్ష సంబంధ రంగులను కలిపి ఆముదం లేదా నువ్వుల నూనెలో సూర్యరశ్మితో వేడైన నీళ్లలో నూలును నానబెడుతారు. కనీసం 20రోజుల పాటు రోజు కు రెండు పూటలా చేతులతో నూలును పిసుకుతారు. ఆ తరువాత నూలును వడకట్టి అరబెడుతారు. ఆరిన తర్వాత మళ్లీ నీళ్లలో నానబెడుతారు. ఇలా 20రోజుల పాటు చేయడం వల్ల దారాల్లోకి నూనె ఇంకి రంగులు చక్కగా అంటుకుంటాయి. తేలియా రుమాలులో వాడే రంగులన్నీ ప్రకృతి సిద్ధంగా తయారు చేసినవే. పటిక, కరక్కాయ, హీరాకాసుతో ఎరుపు, నీలం, పసుపు మొదలైన రంగులన్నీ చెట్ల నుంచి తయారు చేస్తారు. నూనెలు, సహజసిద్ధ రంగులు వాడడం వల్ల తేలియా రుమాలుకు జౌషధ గుణాలూ అందుతాయి కాబట్టే వేసవి తాపం నుంచి తప్పించి చల్లదనాన్ని అందిస్తుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉండే గల్ఫ్ ప్రాంతాల్లో తేలియా రుమాలును ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
భర ్తప్రోత్సాహంతోనే అవార్డు దక్కింది..
వందల ఏండ్లుగా మా భర్త కుటుంబ సభ్యులు తేలియారుమాలును తయారు చేస్తున్నారు. నేను కూడా చిన్నతనం నుంచే మగ్గం పని చేసేదాన్ని. భర్త శంకర్ చేనేత వృత్తిలో కొత్త అవిష్కరణలు చేస్తుండటంతో నాకు ఆసక్తి పెరిగింది. రసాయన రంగులకు బదులు ప్రకృతి సిద్ధంగా లభించే రంగులను వాడుతున్నాం. భర్త ప్రోత్సాహంతోనే అవార్డు వచ్చింది.