బేగంపేట్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో లోక క్షేమం కల్యాణార్థం 44 రోజుల దీక్షగా రుద్ర సంఖ్య పూర్వక కృష్ణ యజుర్వేద అఖండ వేద పారాయణం ప్రారంభించారు. 44 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నాం 12.15 నిమిషాల వరకు ఈ పారాయణం జరుగుతుందని దేవాలయం ఈవో గుత్తా మనోహార్ రెడ్డి తెలిపారు.
వేద వారధి ఘన కేసరి క్రమ రత్నాకర శ్రుతి విద్యాలంకార బిరుదాంకితులైన గంగాధర కేధార నాథశర్మ ఘనపాటి శ్రీ రాజరాజేశ్వర సాంగ వేద విద్యాలయం వారి సంపూర్ణ సహాకారంతో 10 మంది వేద పండితులతో ఈ అఖండ వేద పారాయణం జరగనుంది ఈ ఉత్సవాన్ని గంగాధర కేధార నాథశర్మ ఘనపాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్తలు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.