
భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 17: పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేదింటి తల్లిదండ్రులు కుమార్తెల వివాహాలు చేసి అప్పుల పాలు కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన 78 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన 32 మందికి మంజూరైన రేషన్ కార్డులను, పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమం లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, ఎంపీటీసీల ఫోరం మం డల అధ్యక్షురాలు బత్తుల మాధవీశ్రీశైలం గౌడ్, నాయకులు పాటి సుధాకర్‌రెడ్డి, మాధవరెడ్డి పాల్గొన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే థ్రిఫ్టు పథకం కొనసాగింపునకు రూ.32 కోట్లను మంజూరు చేయించేందు కు విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని మంగళవా రం పోచంపల్లి పట్టణంలో చేనేత కార్మిక నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో సీత వెంకటేశం, తడక రమేశ్, అంకం పాండు, శ్రవణ్, మధు పాల్గొన్నారు.