నెలలోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలి
-
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
యాదాద్రి, ఏప్రిల్ 28: ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పురోగతిలో ఉన్న పనులు నెలలోపు పూర్తి చేయాలని, ఇప్పటికే మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ఆర్అండ్బీ రోడ్లు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, పల్లెప్రగతి పనులను గురువారం ఆమె కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఎక్కడైనా పెండింగ్ పనులు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మంజూరు పనులు ప్రారంభించాలని సూచిస్తూ కొత్తగా గుర్తించిన పనుల అంచనా వ్యయం తయారు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ శంకరయ్య, జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి సునంద, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీమా చెక్కు అందజేత
బొమ్మలరామారం, ఏప్రిల్ 28 : మండలంలోని మర్యాల గ్రామానికి చెందిన ముత్యాల రాజిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను టీఆర్ఎస్ సభ్యత్యం కలిగి ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయగా, పార్టీ బీమా విభాగం నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కును ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రాజిరెడ్డి భార్య ముత్యాలలక్ష్మికి గురువారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మన్నె శ్రీధర్, గొడుగు చంద్రమౌళి, సందగళ్ల నవీన్, ధీరావత్ రాజన్ నాయక్, కట్ట శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

